భారతదేశం అనేకరకమైన జీవరాసులకు నిలయం. ఒకొక్క జీవరాసికి ఒక్కో ప్రాధాన్యత మరియు ప్రాముఖ్యత కలిగి ఉన్నది. మంచి వ్యక్తులు మరియు జీవారసుల సమూహం వలన భారతదేశంని గొప్ప దేశంనే కాకుండా అత్యంత ఆధ్యాత్మిక ప్రదేశంగా గుర్తింపుతెచ్చారు. భారతదేశంలోని ప్రజలు భగవంతుని యొక్క గొప్పతనం పూజించటమే  కాకుండా ఆయన జీవితాన్ని చదివి, తెలుసుకుని, ఆచరణలో పెడతారు.  ప్రజలు దేవతలను మాత్రమే కాకుండా జంతువులను గౌరవిస్తారు, రక్షిస్తారు మరియు పూజిస్తారు. ఆవుల తో పాటు ఎద్దులు, పాములు వంటి జీవరాసులను కూడా భారతదేశంలో అత్యంత విశ్వసనీయతతో పూజిస్తారు. మన దేశంలో పెద్ద సంఖ్యలో పాములు ఉన్నాయి. వివిధ రకాల పాములు మరియు వాటి యొక్క విషపురితము బట్టి కింగ్ కోబ్రా నుండి  పైథాన్ల వరకు విభజించబడ్డాయి. కొన్ని సందర్భాల్లో పాములు ఎలుకలను పట్టుకోవటానికి మరియు కొన్ని ఆర్థిక అంశాలలో పెంపుడుగా కుడా ఉపయోగిస్తారు.

మన దేశంలో దాదాపు మూడు వందల రకాల పాములు ఉన్నాయని అంచనా.

కాబట్టి, పాము యొక్క ప్రాముఖ్యత పురాతనము నుండి ఈ సమకాలీన కాలం వరకు పెంచబడినది. పాము విషం వైద్య అవసరాలకు, కొన్ని రకాల సౌందర్య సాధనలు మరియు ఇతర వాటిలో ఉపయోగిస్తారు.

పరిచయం

నాగుల చవితి (సర్పోత్సవం) ఆంధ్ర ప్రదేశ్ లో మరియు చుట్టుపక్కల మహిళలచే జరపబడుతున్న  ప్రముఖ పండుగలలో ఒకటి. ఈ పండుగను జరుపుకోవటం వలన తమ కుటుంబాలు సంక్షేమంగా , ఆరోగ్యంగా మరియు సంపద నిండి ఉంటారని నమ్మకం. నాగమ్మ దేవత తమ  జీవితంలో ప్రశాంతత మరియు పరిపూర్ణతను తెస్తుందని ప్రజలు ఇప్పటికి విశ్వసిస్తారు.

“నాగుల చవితి” అనే పదం రెండు పదాల యొక్క ఏకీకరణ.

అందుకే నాగుల చవితిని దీపావళి తర్వాతి నాలుగో రోజున శుభప్రదమైన కార్తీక మాసంలో జరుపుకుంటారు. దీనినే కొన్ని ప్రాంతాలలో సర్పోత్సవం అని కూడా అంటారు.

ఈ ఆధునిక సంస్కృతిలో పాముల యొక్క గొప్పతనం మరియు  మూలాలు పురాతన సమాజం నుండి ఉద్భవించాయి.

పురాణం బట్టి మొదటిది

క్షీరసాగర మధనం సమయం లో ఉద్భవించిన పదార్ధాల్లో అమృతం మరియు విషం కూడా ఉన్నవి. దేవతలు మరియు ఇతరులు వారి అమరత్వం కోసం చాలా అమృతాన్ని సేవించారు. మిగిలిపోయిన విషాన్ని శివుడు తీసుకొని విశ్వాన్ని, జీవరాశిని కాపాడటానికి తన కంఠంలో  నిల్వ చేసారు. అందువలన ఆయన కంఠం నీలం రంగు లోకి మారింది. అందుకే ఆయనకు నీల కంఠ అని పేరు తో పిలుస్తారు.ఈ సంపూర్ణ పరిస్థితి నాగుల చవితి రోజున జరిగిందని చాలామంది నమ్ముతారు.

 

ఇంకొక సందర్భం:-

పురాణాల ప్రకారం ఈ విశ్వంలో ఉన్న సమస్త సర్పాలను లొంగదీసుకోవడానికి, జయించటానికి జనమేజయ మహారాజు సర్పయాగం ప్రారంభించాడు.పాముల రాజు వినాశకరమైన పరిస్థితి నుండి పాములను రక్షించడానికి దేవతలలోరాజైన ఇంద్రుడుని  చేరుకుంటాడు. ఇంద్రుడు సర్పయాగాన్ని ఆపడానికి ఎంత ప్రయత్నించినా జనమేజయ మహారాజు ఉపయోగించిన మంత్రాలు చాలా శక్తిమంతమైనవి అందువల్ల అయ్యన కృషి నశించింది. దాంతో ఇంద్రుడు సర్పరాజుని ఆస్తిక మహర్షి దగ్గరకు వెళ్ళమన్నాడు. పాములు మరియు దేవతలు అతని ఆశ్రమానికి చేరుకున్నారు, నాశనం నుండి రక్షించమని అతనిని వేడుకున్నారు. అస్తిక ముని కష్టపడి సర్పయాగం ఆపేశాడు.

ఇది కుడా నాగుల చవితి సందర్భంలో జరిగింది అనే నమ్మకం. అప్పటి నుంచి ఆ ప్రాంతంలోని ప్రజలు పాములను పూజించడం ప్రారంభించారు.

ఆ రోజు నుండి ఆంధ్రప్రదేశ్లో  నలుమూలల నుండి ప్రజలు నాగుళ చవితిని జరుపుకుంటూ పాలు, గుడ్డు ఇతర ఆహార పదార్థాలను అందించడం ప్రారంభించారు. కొన్ని ప్రాంతాల్లో బాణసంచా కాల్చి తమ ఆనందాన్ని, సంబరాలను చాటుకున్నారు.

ఈ విధం గా నాగుల చవితి ఆవిర్భావం  పురాణాలలో చోటు చేసుకుంది.

అనేక పరిశోధన మరియు పుస్తకాలు ఎల్లప్పుడూ శాస్త్రీయ పద్దతిలో నాగుల చవితి వేడుక సమయంలో సరిగ్గా ఏమి జరుగుతుందో విశ్లేషించడానికి ఈ పరిస్థితులపై పనిచేయడానికి ఉత్తమంగా కృషి చేసారు.

పాముల ప్రవర్తనకు సంబంధించిన అనేక అధ్యయనాలు చదివిన తరువాత వారు ఒక విషయం ని తెలుసుకున్నారు. శీతాకాలంలో తేమతో కూడిన పరిస్థితి, చల్లని వాతావరణం నుండి ఉపశమనం పొందటానికి తనని తాను వెచ్చపరుచుకోటానికి  సంభోగం లేదా ఒక ఆశ్రయం కోసం ఇక్కడ మరియు అక్కడ తిరుగుతూ పాములు ఉంటాయి.

కొన్నిసార్లు పాముల యొక్క మానసిక పరిస్థితి, బయట ఉష్ణోగ్రతలో ఆకస్మిక మార్పు ఫలితంగా  ప్రమాదకరమైన విధంగా ప్రవర్తిస్తాయి. దానివలన పొలాల్లో వెళ్ళేవారిని నడిచేవారిని  కాటువయటం చేస్తాయి. కొన్ని కొన్ని సార్లు ఇండ్లలోకి చేరి ప్రజలను భయబ్రాంతులు చేస్తాయి.

 

ఒక సర్పము ని పట్టుకోవడం చాలా సులభమైన పని  మాత్రమే కాదు చాలా కష్టం.

కనుక వాటిని తమ గమ్య స్థానానికి ఇంకా ఒక ప్రదేశం లో చేర్చి ఆశ్రయం కల్పించాలి.

దీని కోసం  చీమల  పుట్టలు చాలా అవసరం.

ఏదో ఒకవిధంగా ఈ పాములు ఆశ్రయాన్ని చేరుకున్నట్లయితే అవి సంభోగం లో పాల్గున్ని తమ శరీరం ని వెచ్చబరుచుకుంటాయి, జనానికి ఎటువంటి హాని కలిగించవు మరియు గుడ్లు కూడా పెడుతాయి.

ఇప్పుడు ప్రశ్న ఏమిటి అంటే పాముల మార్గం ని పుట్టలోకి మార్లించటం ఎలా?

పాములకి ఎర వేయాలి. ఎరగా చీమలను ఉపయోగించాలి.

అంటే ఎలా?

వేడుక సమయంలో సమీపంలోని ప్రాంతాల్లో ప్రజలు పాలు పోయడం ప్రారంభిస్తారు మరియు   గుడ్లు కుడా వేస్తారు. పాలల్లో ఉండే చెక్కరపేరు లాక్టోజ్. కాబట్టి చీమలు పాలల్లో ఉండే చక్కెర రుచిని చూసేందుకు ఆకర్షితులవుతాయని అందరికీ తెలుసు.

కాబట్టి, పాలు త్రాగడానికి లేదా పాలులో ఉన్న చక్కెరను తినే క్రమంలో వాటి పుట్టలకు మరియు ఆశ్రయాలకు తరలిరావటం ప్రారంభిస్తాయి. అలాగే, మనం పరిగణించవలసిన మరొక విషయం ఏమిటి అంటే, ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి కదిలే సమయంలో కానీ తమని తాము రక్షించుకునే పరిస్థితులో కానీ చీమలు తమ శరీరం లో నుండి ఫార్మిక్ ఆమ్లంని విడుదల చేస్తాయి.

చక్కెరను తినడానికి అన్ని చీమలు ఒక ప్రదేశంలోకి వచ్చినప్పుడు ఫార్మక్ ఆసిడ్ యొక్క గాటు వాసన క్రమంగా పెరగటం మొదలవుతుంది – ఇది పాము, చిలుకలు, బల్లులు మరియు ఇతర చీమలు తినే పక్షులను ఆకట్టుకోటం  మొదలుపెడతాది .  దాని వలన చిన్న కీటకాలు మరియు వాటిని తినే కప్పలు కుడా అక్కడికి చేరుకుంటాయి. ఆ కప్పలను తినడానికి పాములు కూడా అందులోకి ప్రవేశిస్తాయి. ఈ విధం గా పాములు ఒక చోట చేరుకోవటం వలన వాటికి ఆశ్రయం కూడా లభిస్తుంది. ఆ సమయం లో అవి శంభోగం లో పాల్గుని గుడ్లు పెట్టటం మొదలు పెడతాయి.ఈ విధం గా పాములను పుట్టకు చేర్చుతారు. అన్ని సార్లు ఇదే జరుగుతుంది అని చెప్పలేము కానీ కొన్ని సందర్భాల్లో ఖచ్చితం గా ఇలానే జరుగుతాయి.

కానీ మరొక ప్రశ్న కుడా ఉన్నది? పాములు నిజం గా గుడ్లు పాలు తాగుతాయ?

పాములు గుడ్లని తినలేవు ఎందుకంటే వాటిని అరిగించే శక్తీ  చాలా తక్కువ.

ప్రస్తుత సమాజం లో నాగుల చవితి ని మోసాగించటానికి ఉపయోగిస్తున్నారు

ఎలా అనేగా..

పుట్ట లో నేల మీద మెత్తటి వస్తువు పరచటం లేక ఇసుక వేసి గుడ్లను పగలకుండా చేసి వాటిని బయటకు తీసి తిరిగి అమ్ముకుంటున్నారు. ఇది ఒక్క ప్రదేశం లోనే కాదు చాలా చోట్లు మనుషుల యొక్క నమ్మకాలను ఉపయోగించి డబ్బులు సంపాదిస్తున్నారు.

‘మనిషి నమ్మకం తోని బ్రతికితే ఋషి అవుతాడు

అదే మూఢనమ్మకం తో బ్రతికితే మూర్ఖులు అవుతారు.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *